schedule Saturday, September 05, 2026

మారేడులో ఆరోగ్యం బోలెడు...!

calendar_today July 29, 2024
person dharshininews
మారేడులో ఆరోగ్యం బోలెడు...!
మారేడులో ఆరోగ్యం బోలెడు...! - పరగడుపునే తింటే ఉపయోగాలు - గుండె నుంచి దంతాలు, ఎముకలకు బెస్ట్ మెడిసిన్‌ దర్శిని డెస్క్ : పరమ శివుడికి ప్రీతిపాత్రమైన మారేడు దళంలో బోలెడు ఆరోగ్యం దాగిఉంది. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయంటున్నారు. మారేడు ఆకులలో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. వేసవిలో ప్రతిరోజూ పరగడుపునే మారేడు ఆకులు తింటే ఎన్నో ప్రయోజనాలు అంటున్నారు. బిల్వపత్రాలు గాలిని, నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని చెబుతున్నారు. మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నివారించే గుణం వుంది. ఇవి గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. మధుమేహ బాధితులకు సైతం ఇది మందుగా పనిచేస్తుంది. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మారేడు ఆకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు మరియు అలెర్జీలతో బాధపడేవారికి మారెడు దళం ఎంతో మేలు చేస్తుంది. బిల్వపత్రంలో ఉండే ఐరన్‌ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. నోటిపూతతో బాధపడేవారు పరగడుపునే దీన్ని తింటే ప్రయోజనం ఉంటుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి) ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27949/