schedule Thursday, September 03, 2026

నేరుగా రుణఖాతాల్లోనే రుణమాఫీ..!

calendar_today July 15, 2024
person dharshininews
నేరుగా రుణఖాతాల్లోనే రుణమాఫీ..!
నేరుగా రుణఖాతాల్లోనే రుణమాఫీ..! - రేషన్ కార్డే రైతు కుటుంబం గుర్తంపు - రుణమాఫీకి మార్గదర్శకాలు రిలీజ్ చేసిన సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సర్కారు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని తెలిపింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమకానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్‌ రుణాలకు, రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్‌ పోర్టల్‌ చూడొచ్చు. లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది.   ఈ కింది go ను క్లిక్ చేయండి... GO Rt. No.567_Crop Loan Waiver. GO Rt. No.567_Crop Loan Waiver ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27735/