schedule Saturday, September 05, 2026

పూల మొక్కలో ఔషధాలు..!

calendar_today April 19, 2024
person dharshininews
పూల మొక్కలో ఔషధాలు..!
పూల మొక్కలో ఔషధాలు..! - షుగర్, గొంతునొప్పులకు సూపర్ మెడిసిన్ - ఎలా తీసుకుంటే మంచిదో తెలుసా..? దర్శిని డెస్క్: సతత హరితపూలు. ఈ పువ్వుకు సువాసన ఉండదు కాని ఆయుర్వేదంలో ఈ పూలను విరివిరిగా ఉపయోగిస్తారని ప్రాచుర్యం ఉంది. పట్టణాలు, నగరాలలో కనిపిస్తుంటాయి. గ్రామాల్లో ఈ పూలను గులాబీ మల్లేపూలు అని అంటారు. ఈ పువ్వు ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బీపీ-షుగర్‌కు వ్యాధులపై ఇది సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. షుగర్.. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి సతతహరిత అనే పువ్వును ఉపయోగించాలని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడానికి ఈ పువ్వులు, ఆకులు చాలా బాగా ఉపయోగపడుతాయి. అంతేకాదు లుకేమియా మలేరియా, గొంతు నొప్పి, స్కిన్ ఇన్‌ఫెక్షన్ వంటి పరిస్థితులను మెరుగుపరచడానికి ఇది మంచి మెడిసిన్ అని చెబుతున్నారు. అలానే క్యాన్సర్ కణాలను కూడా అడ్డుకుంటుందట. బీపీ ఉన్నవారికి సైతం దీని ఆకులు నేచురల్ మెడిసిన్‌లా ఉపయోగపడతాయట. రోజూ మార్నింగ్, ఈవెనింగ్ 2 నుంచి 3 ఆకులను నమలడం వల్ల షుగర్, బీపీ సమస్యలకు చెక్ పెట్టవచ్చట. (గమనిక : ఈ కథనంలో అందించిన సలహా సాధారణ సమాచారం కోసం. ఏదైనా ఆరోగ్య సలహాపై చర్య తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించండి) https://www.dharshininews.com/25607/