కూల్ వాటర్ ఇంత డేంజరా..!
April 6, 2024
dharshininews
కూల్ వాటర్ ఇంత డేంజరా..!
- శరీరానికి ఇలాంటి ప్రమాదాలు ఖాయం
- ఫ్రిజ్ వాటర్ ఎంతవరకు మేలంటే..?
దర్శిని డెస్క్: రోజు రోజుకు మండుతున్న ఉండలతో, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవిలో ఏర్పడిన దప్పికను తీర్చుకునేందుకు చల్లనీ నీటి కోసం తాపత్రయ పడవారు. కుండలో చల్లనీ నీరు ఆరోగ్యకరమైనప్పటికి ప్రజలు ఫ్రిజ్ లో ఉంచిన నీళ్ల వైపే మొగ్గుచూపుతారు. దాహం వేసినప్పుడల్లా.. ఫ్రిడ్జ్ లోని వాటర్‌ను బయటకు తీసి తాగడం ప్రారంభిస్తారు. అయితే ఫ్రిజ్‌లోని నీటిని నేరుగా తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన చల్లటి నీటిని తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని, కూల్ వాటర్ శరీరానికి ప్రమాదకరంగా మారవచ్చంటున్నారు.
ఇతర సమస్యలకు దారి
రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల ఊబకాయం పెరగడమే కాకుండా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు నెమ్మదిగా పెరుగుతుంది.. స్థూలకాయాన్ని తగ్గించుకోవడంలోనూ, కొవ్వును కరిగించుకోవడంలోనూ చాలా కష్టాలు మొదలవుతాయి. అదేవిధంగా చల్లటి నీరు తాగడం వల్ల గుండెకు చాలా హాని కలుగుతుంది. దీని కారణంగా, రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు చాలా గట్టిపడతాయి. దీంతో గుండె సమస్యలు మొదలవుతాయి.
అంతేకాకుండా చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణశక్తి పూర్తిగా పాడవుతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్యను పెంచుతుంది. ఇలాంటి కారణాలతో ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదరైతే ఆసుపత్రిలో చేరాల్సిందే. ఫ్రిజ్‌లోని చల్లని నీరుతో కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచుకుని అవసరమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/25132/