schedule Saturday, July 04, 2026

గ్యాస్ ఈకేవైసీ ఇంట్లోనే..!

calendar_today February 24, 2024
person dharshininews
గ్యాస్ ఈకేవైసీ ఇంట్లోనే..!
గ్యాస్ ఈకేవైసీ ఇంట్లోనే..! - అది ఉంటే ఈజీగా చేసుకోవచ్చు - మార్చి 31 వరకు మాత్రమే గడువు దర్శిని డెస్క్ : దేశంలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈకేవైసీ తప్పక చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉజ్వల పథకంతో పాటు సామాన్య వినియోగదారులు కోట్లాది మంది సబ్సిడీ పొందుతున్నారు. అయితే ఇంకా చాలా మంది వినియోగదారులు ఈ కేవైసీ అప్‌డేట్ చేసుకోలేని తెలుస్తోంది. ఈ కేవైసీ కోసం వచ్చే నెల మార్చి 31 వరకు మాత్రమే కేంద్రం గడువు విధించింది. మీరు ఈ డేట్‌కు ముందు కేవైసీ పొందకపోతే.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆగిపోవచ్చు. అయితే ఈ కేవైసీ అప్‌డేట్ చేసేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆఫ్‌లైన్‌లో చేయొచ్చు. లేదా మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ నుంచి ఇంట్లో నుంచి ఆన్‌లైన్ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కేవైసీ చేసుకోవాలనుకుంటే.. మొదటగా https://www.mylpg.in కి వెళ్లాలి. మీ గ్యాస్ కనెక్షన్ కంపెనీ పేరు ఎంచుకోవాలి. HP, Indane, భారత్ గ్యాస్ కంపెనీల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీకు కనెక్షన్ ఉన్న గ్యాస్ కంపెనీ సిలిండర్ చిత్రంపై అక్కడ క్లిక్ చేయాలి. మీరు ఇప్పుడు ఎంచుకున్న గ్యాస్ కంపెనీ వెబ్‌సైట్‌లో కేవైసీకి వెళ్లండి. తర్వాత ఇక్కడ ఒక ఫారం ఓపెన్ అవుతుంది. దీంట్లో మొబైల్ నంబర్, కస్టమర్ నంబర్, LPG ID వంటివి పూరించాలి. తర్వాత ఆధార్ ధ్రువీకరణ OTP మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే కేవైసీ పూర్తయినట్లే. ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24047/