schedule Friday, September 04, 2026

నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం

calendar_today December 8, 2023
person dharshininews
నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం
నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం - యశోధ ఆసుపత్రిలో చికిత్స - కాసేపట్లో హెల్త్ బులెటిన్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయపడ్డారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. అర్థరాత్రి కాలికి పంచె తగలడంతో, కేసీఆర్ కాలు జారి పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. కాసేపట్లో చేయబోయే వైద్య పరీక్షలపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌కి యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ వైద్యులు టెస్ట్‌లు చేసిన తర్వాత హెల్త్‌ బులెటిన్‌ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కేసీఆర్‌ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్‌ కుటుంబంతోపాటు హరీష్‌రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/22466/