schedule Friday, September 04, 2026

ఎలక్షన్ కోడ్ ఖతం..!

calendar_today December 4, 2023
person dharshininews
ఎలక్షన్ కోడ్ ఖతం..!
ఎలక్షన్ కోడ్ ఖతం..! - ఎత్తివేసినట్లు ఈసీ ప్రకటన - అమలుకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ టైం ముగిసిపోయింది. ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో గత అక్టోబర్‌ 9న షెడ్యూల్‌ వెలువడిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 3న ఎన్నికల ప్రకటన జారీ కాగా, డిసెంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న పరిశీలన, 15న ఉప సంహరణ జరిగింది. 30న పోలింగ్‌ జరిగింది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఫలితాలు వెలువడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దేశంలో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎన్నికల కోడ్‌ను ఈసీ ఎత్తివేసింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22406/