schedule Friday, September 04, 2026

కేసీఆర్ రాజీనామా

calendar_today December 3, 2023
person dharshininews
కేసీఆర్ రాజీనామా
కేసీఆర్ రాజీనామా - రాష్ట్ర గవర్నర్‌కు లేఖ - వెంటనే ఫాంహౌస్‌కు కేసీఆర్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి లేఖ పంపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను అలవోకగా అందుకునే అవకాశం ఉంది. దీంతో వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలు ఆవిరైపోయాయి. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు కూడా బీఆర్‌ఎస్‌ పరాజయాన్నిఅంగీకరించారు. రెండుసార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ సమాజం పట్ల, ప్ర‌జ‌ల‌ పట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉంటామని, ఈ ఫ‌లితాలను ఒక పాఠంగా భావిస్తామని, మళ్లీ పుంజుకొంటామన్నారు. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి తన రాజీనామా లేఖను తన ఓఎస్డీతో లేఖను పంపారు. ఆ తర్వాత తన సొంత వాహనంలో ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం (డిసెంబర్‌ 4)న మంత్రివర్గ సమావేశానికి సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి.... https://dharshininews.com/22387/