schedule Sunday, September 06, 2026

మాకు తుపాకీ లైసెన్స్‌ ఇప్పించండి..!

calendar_today October 27, 2023
person dharshininews
మాకు తుపాకీ లైసెన్స్‌ ఇప్పించండి..!
మాకు తుపాకీ లైసెన్స్‌ ఇప్పించండి..! - అప్పుడే మీకు ఓట్లు వేస్తాం - యువకులు ఈ డిమాండ్ ఎందుకు చేశారో తెలుసా..? దర్శిని డెస్క్‌ : మాకు తుపాకీ లైసెన్స్‌లు ఇప్పించండి.. అప్పుడు మీకే ఓటేస్తామని యువకులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు ఓటర్ల నుంచి కొత్తరకమైన ఈ డిమాండ్ ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని నిర్మూలించడానికి భిండ్ నియోజకవర్గ ఓటర్లు తమకు తుపాకీ లైసెన్సులు కావా లని కోరుతున్నారు. తుపాకీ లైసెన్సు ఉంటే.. దేశంలో ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు చేసుకోవచ్చన్నది. వారి ఉద్దేశం. మధ్యప్రదేశ్లోని నిరు ద్యోగ సమస్యకు భాజపా ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపనందున ఓటర్ల తుపాకీ లైసెన్సు డిమాండు న్యాయమైనదేనని బిండ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాకేస్సింగ్ చతుర్వేది అంటున్నారు. ఇటు భాజపా అభ్యర్థి నరేంద్రసింగ్ కుశ్వాహా కూడా అధికారంలోకి రాగానే ప్రభుత్వంతో మాట్లాడి ఓటర్ల డిమాండు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. ఈ సంఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21337/