schedule Saturday, September 05, 2026

ఎన్నికల షెడ్యూల్‌కు వేళాయే..!

calendar_today October 9, 2023
person dharshininews
ఎన్నికల షెడ్యూల్‌కు వేళాయే..!
ఎన్నికల షెడ్యూల్‌కు వేళాయే..! - నేడు మధ్యాహ్నం ప్రకటించే అవకాశం - తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్‌ దర్శిని డెస్క్‌ : దేశమంతా ఎన్నికల ఫీవర్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో ఈ యేడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించేందుకు సిద్దమైంది. ఐదు రాష్ట్రాల్లో నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు ఎన్నికలు జరగొచ్చని ఈసీ వర్గాలు గతంలో పేర్కొన్నాయి. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. సీఈసీ రాజీవ్‌కుమార్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌ , ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20911/