schedule Saturday, September 05, 2026

దసరా సెలవులు డిక్లేర్..!

calendar_today October 7, 2023
person dharshininews
దసరా సెలవులు డిక్లేర్..!
దసరా సెలవులు డిక్లేర్..! - స్కూల్, కాలేజీ విద్యార్థులకు హాలిడేస్ - ఎవరెవరికి ఎప్పటినుంచో ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో మొత్తం మీద దసరా సెలవులు వచ్చేస్తున్నాయి. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతో పాటు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈనెల 13వ తేదీనుంచి 25వ తేదీవరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. వీరికి 13 రోజులపాటు సెలవులు వచ్చాయి. కాలేజీలకు మాత్రం ఏడురోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 19వ తేదీనుంచి 25వ తేదీవరకు సెలవులు ఇచ్చారు. అతి పెద్ద పండుగలలో దసరా పండుగను అట్టహాసంగా జరుపుకోవడం ఆనవాయితి. ఉద్యోగాల కోసం వెళ్లిన వారు, వలస వెళ్లిన వారు తమ ప్రాంతాలకు వెళ్లి పండగను జరుపుకుంటారు. ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో తమ ప్రాంతాలకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇది కూడ చదవండి.. https://dharshininews.com/20861/