schedule Friday, September 04, 2026

మహిళలకు సర్కారు కానుక..!

calendar_today October 3, 2023
person dharshininews
మహిళలకు సర్కారు కానుక..!
మహిళలకు సర్కారు కానుక..! - రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ - రూ.354 కోట్లతో 1.02 కోట్ల చీరలు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని మహిళలకు కానుక అందించేందుకు సర్కారు సిద్దమైంది. ప్రతి యేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధంచేశారు. జరీతోపాటు వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారుచేయించారు. వివిధ రకాల ఆకర్షణీయ రంగులు, థ్రెడ్‌ బోర్డర్‌ (దారపు పోగుల అంచులు)తో 100 శాతం పాలిస్టర్‌ ఫిలిమెంట్‌ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందని పేర్కొన్నారు. ఆరు మీటర్ల (5.50+1.00) పొడవుగల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్ల పొడవుగల చీరలు కూడా తయారు చేయించారు. బతుకమ్మ పండుగ సమీపిస్తుండటంతో రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు ఈ నెల 4 నుంచి చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్‌శాఖ సన్నాహాలు చేస్తున్నది. చౌకధర దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20786/