schedule Saturday, September 05, 2026

టిక్కెట్‌లో చేంజ్‌లు..!

calendar_today August 30, 2023
person dharshininews
టిక్కెట్‌లో చేంజ్‌లు..!
టిక్కెట్‌లో చేంజ్‌లు..! - ట్విస్టులు ఇవ్వనున్న గులాబీ బాస్ - టెన్షన్‌లో గెలుపు గుర్రాలు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలపై బీఆర్‌ఎస్ మాంచి దూకుడు మీద ఉంది. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేందుకు సీఎం కేసీఆర్ చక్రవ్యూహాలను ప్రయోగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులను ఒకేసారి 115 మందిని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచారు. ఈ 115 మంది అప్పటి వరకు సంతోషంలో మునిగిన కొద్ది సేపటికే అభ్యర్థులను టెన్షన్‌లో పడేశారు. సీట్లు ప్రకటించిన రోజు.. వారి పెదవులపై కనిపించిన చిరునవ్వు స్థానంలో.. ఇప్పుడు వారి ముఖాలు ఆందోళనతో కనిపిస్తున్నాయి. జాబితా ప్రకటించిన రోజే సీఎం కేసీఆర్ అభ్యర్థులతో తేడా కనిపిస్తే కొన్ని మార్పుచేర్పులుంటాయని చివర్లో ట్విస్ట్‌ ఇచ్చారు. ఇదే ఇప్పుడు టిక్కెట్టు దక్కించుకున్న అభ్యర్థులను టెన్షన్‌లో పెట్టింది. బీఆర్‌ఎస్‌ ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కేసీఆర్‌ వాళ్లందరికీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇవ్వడంతో వాళ్లకు బీ ఫారం ఇస్తారా? లేదా? అన్న అనుమానాలకు కలవరపెడుతోంది. మరోవైపు ఇంకా టిక్కెట్‌ దక్కని ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారు. టిక్కెట్టు దక్కించుకున్న అభ్యర్థులు కేసీఆర్ మనసులో టిక్కెట్టు కన్‌ఫామ్ చేసుకునేందుకు ప్రజా ఆశీర్వాద సభలకు సిద్దమవుతున్నారు. మరి గులాబీ బాస్ మనసు మారుతుందా.. లేదా అన్నది ఉత్కంఠ నెలకొంది. ఇది కూడ చదవండి... https://dharshininews.com/19760