schedule Saturday, September 05, 2026

లవంగాల్లో అద్భుతమైన ఔషధం

calendar_today July 24, 2023
person dharshininews
లవంగాల్లో అద్భుతమైన ఔషధం
లవంగాల్లో అద్భుతమైన ఔషధం - పలు ఆరోగ్య సమస్యలకు చెక్ - ఎలాంటి మేలు చేస్తాయో తెలుసా దర్శిని డెస్క్‌: ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగించే లవంగాల గురించి అందరికి పరిచరం అక్కర్లేదు. ప్రతి వంటింట్లో పోపులడబ్బాలో ఉండే లవంగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్క పంటినొప్పికే కాకుండా అనేక రకాలుగా పలు ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ఉపకరిస్తాయి. అందులోని యాంటి ఆక్సీడెంట్లు శరీరానికి అంటే రోగాలను దూరం చేస్తాయి. మరి అంత విశిష్టత కలిగిన లవంగాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగంలో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటాయి. దగ్గు, స్వరపేటికవాపు, గొంతు నొప్పి వంటి వాటిని ఎదుర్కోడానికి సహజంగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు.. రోజూ లవంగాలను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వికారం, పొట్టలో పుండ్లు, అజీర్తి మనల్ని ఇబ్బంది పెట్టే జీర్ణ సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది. శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఎండిన లవంగం తెల్లరక్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా కాలేయాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులను నివారిస్తోంది. తేనె, కొన్ని లవంగాల నూనెను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18792 chaithany collage