schedule Sunday, September 06, 2026

స్మార్ట్‌ ఫోన్‌కు టమాటాలు ఫ్రీ..!

calendar_today July 9, 2023
person dharshininews
స్మార్ట్‌ ఫోన్‌కు టమాటాలు ఫ్రీ..!
స్మార్ట్‌ ఫోన్‌కు టమాటాలు ఫ్రీ..! - ఆకర్షించిన షాపు యజమాని - వైరల్‌గా మారిన సంఘటన దర్శిని డెస్క్‌ : టమాటా ధరలు పెరగడంపై దేశంలో ఎన్నో విమర్శలు పుడుతున్నాయి. రూ. 150 దాటేసింది. కొన్ని చోట్ల అయితే రూ. 200కి చేరువుతోన్న తరుణంలో కొంత మంది వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇదిలా ఉంటే ఓవైపు టమాట ధర కంట తడి పెట్టిస్తుంటే దానికి సంబంధించిన మీమ్స్‌ నవ్వులు పూయిస్తున్నాయి. ఈ క్రమంలో టమాట ధరలను తన మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చుకున్నాడు ఓ మొబైల్‌ షాప్‌ ఓనర్‌. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌ నగర్‌లో అశోక్‌ అగర్వాల్‌ అనే యువకుడు మొబైల్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెరిగిన టమాట ధరలను తన షాప్‌ ప్రచారానికి వాడుకోవాలనుకున్నాడు. తన దుకాణంలో స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే 2 కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తానని ఆఫర్‌ ప్రకటించాడు. అంతేకాకుండా తన దుకాణంలో స్మార్ట్‌ ఫోన్‌ కొంటే 2 కిలోల టమాట ఫ్రీ అంటూ ఫ్లెక్సీ కూడా పెట్టించాడు. దీంతో స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారంతా అశోక్‌ దుకాణానికి క్యూ కడుతున్నారు. ఈ ప్రకటన తర్వాత తన షాపులో అమ్మకాలు పెరిగాయని చెప్పుకొచ్చాడు అశోక్‌. మరోవైపు నెట్టింట టమాటపై బోలెడన్నీ జోకులు చక్కర్లు కొడుతున్నాయి. టమాటను బంగారం, డైమండ్‌తో పోల్చుతూ చేస్తున్న మీమ్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18417 chaithany collage