schedule Saturday, July 04, 2026

సమ్మెలో విద్యుత్ సమస్యలు సృష్టిస్తే చర్యలు

calendar_today April 23, 2023
person dharshininews
సమ్మెలో విద్యుత్ సమస్యలు సృష్టిస్తే చర్యలు
సమ్మెలో విద్యుత్ సమస్యలు సృష్టిస్తే చర్యలు - అంతరాయం కలిగిస్తే ఫిర్యాదు చేయండి - వినియోదారులకు విద్యుత్ అధికారుల సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ వినియోగదారులకు ఎవరైనా సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవని వికారాబాద్‌ సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ వి. జయరాజు అన్నారు. విద్యుత్ సంస్థలో వివిధ సబ్ స్టేషన్ ఆపరేటర్లుగా మరియు O&M విభాగం లో పనిచేస్తున్నటువంటి H-82 ఆర్టిజన్స్ యూనియన్ ఉద్యోగులు, కార్మికులు ఈ నెల 25వ తారీకు నుండి సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖపై, మేనేజ్మెంట్ మీనా ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన చేసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయాలు కలిగితే, ఎవరైనా వ్యక్తులు విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర, ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర, విద్యుత్ లైన్ల దగ్గర ఏ విధమైన సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు. అలాంటి కార్యక్రమాలకి పాల్పడినట్లు గాని లేదా కృత్రిమంగా విద్యుత్ సరఫరా లేకుండా చేస్తున్నట్లు తెలిస్తే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నచోట మీ ఫోన్లో ఫోటోలు తీస్తూ సంబంధిత అధికారులకు లేదా పోలీసు అధికారులకు ఫోటోలు, వీడియోలు షేర్ చేయవలసిందిగా కోరారు. మరోవైపు ఈనెల 25వ తారీకు నుంచి ఆర్టిజన్ కార్మికుల పై ఎస్మా చట్టం అమల్లోకి వస్తుందని ఇందులో భాగంగా సమ్మెకు వెళ్లే H-82 ఆర్టిజన్స్ సబ్ స్టేషన్ ఆపరేటర్ల స్థానాలలో స్పెషల్ గా డిపార్ట్మెంట్ వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కింది ఫోన్‌లకు ఫిర్యాదులు చేయండి Control room cell no 9493193177,9491441225 Sri V. జయరాజు SE వికారాబాద్ జిల్లా Cellno :7901093659 Sri V. భాను ప్రసాద్ DEE/ Tandur డివిజన్ p no.7901093661 Sri R.. ఆదినారాయణ ade/tandur subdivision cell no 9440813067 Sri N. రఘువీర్ రెడ్డి ae/ tandur town,cell no 9440813091, Fuseoff calls:9493193198, Tandur division control room Sri Sai krisha AE/tecnical/ tandur cell no 9553225122, అరవింద్, sub engineer tandur town cell:9381778156, 7396662969, Ravi,sub engineer cell:6281242751,8801825259 Sri K. వెంకట నాయుడు ae/రూరల్ tandur,9440816240 Sri M. భాను ప్రకాష్ ae/ బషీరాబాద్,9440813093 Sri M. సురేష్ రెడ్డి ae/ కోటపల్లి, పెద్దేముల్, బంటారాం,9440813095,6300945219,