schedule Sunday, September 06, 2026

చురుక్కు మీదున్న సూరీడూ..!

calendar_today April 12, 2023
person dharshininews
చురుక్కు మీదున్న సూరీడూ..!
చురుక్కు మీదున్న సూరీడూ..! - రెండు రోజులు ఎండలు డేంజరే - అవరసమైతేనే బయటకు రండి - శాస్త్రవేత్తల సూచనలు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: ఆకాశంలోని సూరీడూ మాంచి చురుక్కు మీదున్నాడు. గత కొన్ని రోజులుగా సుర సురమనే ఎండలతో దంచికొడుతున్నాడు. ఈ నేపథ్యంలో నేడు, రేపు రెండు రోజులు కూడా ఎండలు డేంజర్‌ స్థాయిలో ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భానుడి భగభగలకు పగటిపూట ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయన్నారు. జనాలు ఎండ వేడిని, ఉక్కపోతను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది. బుధవారం నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని.. అలాగే అవసరమైతేనే తప్ప బయటికి రావొద్దని పేర్కొంది. అటు క్రింది స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తుండటంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ జారీ చేసిన రిపోర్టు https://twitter.com/Rajani_Weather/status/1645615149691068416?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1645615149691068416%7Ctwgr%5E50ddc0340176a50ae0d9d72962aa09a5b5d6ae34%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftelangana%2Fhyderabad%2Ftelangana-may-records-hottest-summer-in-coming-days-hyderabad-sizzles-at-40-degree-celsius-au20-931603.html