schedule Tuesday, September 08, 2026

వాట్సాప్‌లో ఎల్ఐసీ సేవలు

calendar_today February 5, 2023
person dharshininews
వాట్సాప్‌లో ఎల్ఐసీ సేవలు
వాట్సాప్‌లో ఎల్ఐసీ సేవలు - ప్రకటించిన బీమా సంస్థ - ఇక ఇంటి నుంచే ప్రయోజనాలు దర్శిని డెస్క్‌: లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్ ఆఫ్‌ ఇండియా(ఎల్ఐసీ) తమ పాలసీ దారులకు శుభవార్త చెప్పింది. ఇకపై వాట్సాఫ్ ద్వారా ప్రయోజనమైన సేవలను పొందవచ్చని ప్రకటించింది. కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సాప్‌ వ్యవస్థ ద్వారా వివిధ సంస్థలు, కంపెనీలు తమ వినియోగదారులకు విశేష సేవలు అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ సంస్థ కూడ తన పాలసీదారులకు ఎల్‌ఐసీ వాట్సాప్‌ సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన కోట్లాది కస్టమర్ల కోసం WhatsApp సేవలను LIC ప్రారంభించింది. డిసెంబర్‌ 02, 2022 నుంచి ఈ తరహా మొట్టమొదటి ఇంటరాక్టివ్ సేవను కంపెనీ ప్రారంభించింది. దీని ద్వారా ఎల్ఐసీ వినియోగదారులు ఇంట్లో కూర్చునే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వాట్సాప్‌ సేవ ద్వారా మీ ఎల్‌ఐసీ పాలసీకి సంబంధించిన చాలా సమాచారం, ప్రీమియం చెల్లింపు చివరి తేదీ సహా అనేక సౌకర్యాలను పొందవచ్చు. మీ చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే, ఇది ఇంకా సులభం అవుతుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఈ సమాచారాన్ని పొందవచ్చు. ఎల్‌ఐసీ అందించే వాట్సాప్‌ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, మీరు ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత మాత్రమే వినియోగదారులు LIC WhatsApp Services ప్రయోజనాన్ని పొందుతారు. ఇంకా మీకు కావల్సిన సమాచారం కోసం ఎల్‌ఐసీ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయడం లేదా ఎల్‌ఐసీ ఏజెంట్లను సంప్రదించడం లేదా ఎల్‌ఐసీ ఆఫీసులకు వెళ్లడం వంటి కాలయాపన చేయాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. వాట్సాప్‌ ద్వారా అందుబాటులో ఉన్న సేవల జాబితా: LIC launches its WhatsApp Services#LIC #WhatsApp pic.twitter.com/vBO4c86xLr — LIC India Forever (@LICIndiaForever) December 2, 2022