schedule Sunday, September 06, 2026

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు వేళాయే..!

calendar_today January 10, 2023
person dharshininews
మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు వేళాయే..!
మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు వేళాయే..! - నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ - 7-10 తరగతుల ఖాళీల భర్తికి ఆహ్వానం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు వేళ అయ్యిందని ఆ శాఖ అధికారులు ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. నేటి నుంచే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మోడల్‌ స్కూల్‌ అదనపు సంచాలకురాలు ఉషారాణి మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.. మోడల్‌ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 15న వెల్లడిస్తారని చెప్పారు . మరిన్ని వివరాలకు మోడల్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌ www.telanganams.cgg.gov.in ను చూడాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.