schedule Saturday, July 04, 2026

ఈ-రేషన్‌ కార్డును పోగుట్టుకుంటే..?

calendar_today December 23, 2022
person dharshininews
ఈ-రేషన్‌ కార్డును పోగుట్టుకుంటే..?
ఈ-రేషన్‌ కార్డును పోగుట్టుకుంటే..? - తిరిగి ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు - ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌ ద్వార పొందే అవకాశం దర్శిని డెస్క్‌: నిరుపేద కుటుంబాలకు గుర్తింపుతో పాటు తక్కువ ధరలకే రేషన్‌ అందించడంలో ఈ-రేషన్ కార్డు కీలకమని అందరికి తెలిసిందే. ఏదేనీ సందర్భాలలో ఈ కార్డును పోగొట్టుకున్నా... ఎక్కడైనా మరిచిపోయిన లబ్దిదారులు ఆందోళన చెంది ఉంటారు. ఇకపై అలాంటి ఆందోళనను మరిచి పోవచ్చు.. ఎందుకంటే పోయిన కార్డును తిరిగి పొందే అవకాశం అందుబాటులో ఉంది కాబట్టి. ఇంట్లో కూర్చునే ఆన్‌ లైన్ ద్వారా పోయిన రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు కోసం ఏమేం చేయాలో తెలుసుకుందాం పదండి. ఆధార్, మోబైల్‌ నెంబర్ లింకు ఉంటేనే.. పోయిన.. లేదా పోగొట్టుకున్న రేషన్‌ కార్డుకు ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్‌ను మీ రేషన్ కార్డ్‌కి లింక్ చేసినప్పుడే మీరు తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అందరు గుర్తించుకోవాలి. కాబట్టి రేషన్ కార్డ్‌తో మొబైల్ నెంబర్‌ను లింక్ చేసినవారే ఈ-రేషన్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు. ఇప్పటికి ఎవరైనా లింకు చేసుకోలేక పోతే వెంటనే ఆ పని చేయండి. కార్డు డౌన్‌లోడ్ కోసం ముందుగా మీరు nfsa.gov.in అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఈ సైట్‌ని ఓపెన్ చేసిన వెంటనే హోమ్‌పేజీలో మీకు రేషన్ కార్డ్ అనే ఎంపిక కనిపిస్తుంది. ఈ ఎంపికకు వెళ్లగానే మీకు స్టేట్ పోర్టల్‌లో రేషన్ కార్డ్ వివరాలు కనిపిస్తాయి. మీరు దానిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్టేట్ పోర్టల్‌లోని రేషన్ కార్డ్ వివరాలపై క్లిక్ చేసిన వెంటనే, మీ ముందు వివిధ రాష్ట్రాల పేర్లు కనిపిస్తాయి. మీరు ఏ రాష్ట్రానికి చెందినవారయితే ఆ రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఈ-రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి రేషన్ కార్డ్ నంబర్, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ పెద్ద ఆధార్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వంటి వివరాలను మీరు తెలియజేయవలసి ఉంటుంది. అడిగిన సమాచారాన్ని మీరు నమోదు చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ నంబర్‌కు OTP వస్తుంది. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. తర్వాత ఈ-రేషన్ కార్డును PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.