schedule Monday, September 07, 2026

అన్నం పెట్టని అలకకు 42 ఏళ్లు

calendar_today December 10, 2022
person dharshininews
అన్నం పెట్టని అలకకు 42 ఏళ్లు
అన్నం పెట్టని అలకకు 42 ఏళ్లు - రోజు చాయ్‌తో జీవనం సాగిస్తున్న భర్త - ఎంతమంది చెప్పినా ససేమిరా దర్శిని డెస్క్‌: అమ్మ తిట్టిందనో.. నాన్న కొట్టాడనో.. పిల్లలు అలగడం సహజం. కాస్త పెద్దయ్యాకా ఆకలేసినప్పుడు అన్నం పెట్టలేదని పెద్దవాళ్లు అలగడం సాధారణం. అది ఒకపూటో.. ఒకరోజుతో చెల్లిపోతుంది. కాని ఓ వ్యక్తి అన్నం పెట్టలేని భార్యపై 42 ఏళ్లుగా అలక పాన్పు వీడడం లేదు. ఇప్పటికి రోజూ చాయ్‌, అటుకులతోనే జీవనం సాగిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. జైపుర్‌ జిల్లాలోని వికీపుర్‌ గ్రామానికి చెందిన రామచంద్ర(76)కు 22 ఏళ్ల వయసులో సీతతో వివాహం జరిగింది. 42 సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య చిన్నగొడవ జరిగింది. ఓ రోజు రామచంద్ర కూలిపనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. అన్నం పెట్టమని భార్యను అడిగాడు. కానీ ఆమె అనారోగ్యం కారణంగా వంట చేయలేదు. రామచంద్రకు అన్నం పెట్టలేకపోయింది. భార్య పరిస్థితిని అర్థం చేసుకోని రామచంద్ర.. తినడానికి అన్నం పెట్టలేదని ఆమెపై అలకపూనాడు. అప్పటి నుంచి కోపంతో అన్నం తినడం మానేశాడు. అలాగని ఆమెతో మాట్లాడటం మానేయలేదు. అన్యోన్యంగానే ఉంటున్నాడు. అన్నం మాత్రం ముట్టుకోవడం లేదు. అన్నం తినమని ఎంత మంది చెప్పినా తిననే తిననని మొండికేస్తున్నాడు. సీతపై 42 ఏళ్లు అలక వహించిన రామచంద్ర ఆకలి అన్నంతో తీరాలని తెలిసిన వారు ఆశిస్తున్నారు.