schedule Sunday, September 06, 2026

చలికాలం బాదం డేంజరే..!

calendar_today December 3, 2022
person dharshininews
చలికాలం బాదం డేంజరే..!
చలికాలం బాదం డేంజరే..! - ఆ వ్యాధులపై మరింత ప్రభావం తప్పదు - జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు దర్శని డెస్క్‌: బాధం ఆరోగ్యానికి మేలు చేస్తుంది కరక్టే కాని చలికాలం బాధం తినడం కాస్త డేంజరే అంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని వ్యాధులపై ఇది విషంగా మారుతుందని నివేధికలు చెబుతున్నాయని పేర్కొంటున్నారు. బాదం తినడం వల్ల కిడ్నీ సమస్యలు, అలర్జీ, శ్వాసకోశ సమస్యలు, డయేరియా వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. కావున జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బాధం ప్రభావం చూపే మరిన్ని వ్యాధుల గురించి తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం చలికాలంలో బాదం పప్పు తీసుకోవడంలో కిడ్నీలపై ప్రభావం పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. బాదంపప్పు తినడంలో అందులో గట్టిగా ఉండే ఆక్సలేట్ అనే మూలకం కిడ్నీలో పేరుకుపోతుంది. అయితే ఈ ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుందని ఓ నివేధికలతో వెల్లడైనట్లు వైద్యులు గుర్తుచేస్తున్నారు. మీకు ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉంటే బాదంపప్పు తినడం మానుకోండి. అలర్జీ వచ్చే ప్రమాదం: నిపుణుల అభిప్రాయం ప్రకారం, అలెర్జీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బాదంపప్పును తీసుకోవాలి. బాదంపప్పులో అమాండిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ వల్ల చాలా మందికి అలర్జీ సమస్యలు రావచ్చు. అసిడిటీ, డయేరియా వచ్చే ప్రమాదం: బాదం తినడం వల్ల కొన్నిసార్లు డయేరియా సమస్య రావచ్చు. బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. శ్వాసకోశ సమస్యలు: బాదంపప్పులో హైడ్రోసియానిక్ యాసిడ్ ఉంటుంది. శరీరంలో అధిక మొత్తంలో HCN ఉంటే, అది శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అందుకే బాదంపప్పులను సమతులంగా తీసుకోవాలి. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)