schedule Sunday, September 06, 2026

డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్‌..!

calendar_today December 2, 2022
person dharshininews
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్‌..!
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్‌..! - ఇంట్లో కూర్చుని దరఖాస్తు దర్శిని డెస్క్‌: ప్రతి నెలా వేలాది మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. కానీ డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం వల్ల చాలామంది లైసెన్స్ పొందలేరు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కొన్ని మార్పులు జరిగాయి. లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం(RTO) దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. దాని కోసం డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే.. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం, 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. కానీ అతడికి లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే లభిస్తుంది. ఈ లైసెన్స్ పొందిన తర్వాత, సదరు వ్యక్తి గేర్ లేని వాహనాలను మాత్రమే నడపగలడు. ఇక ఈ లైసెన్స్ పొందడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటి సౌకర్యం నుండి ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లో దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాని గేర్ వాహనాలను నడపాలంటే.. కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిందే. మీరు ఆ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత.. సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందగలరు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోండిలా: డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దానికోసం ఈ లింక్ క్లిక్ చేయండి. అక్కడ ఉన్న ఎంపికలను బట్టి మీరు ఎన్నుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలి. సబ్మిట్ చేయాల్సిన పత్రాలను అందించాలి. ఆ తర్వాత RTO వాటిని ధృవీకరిస్తుంది. పత్రాలు క్లియర్ అయిన అనంతరం, మీరు ఏడు రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ టెస్ట్ లేకుండా, మీరు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే పొందగలరు.