schedule Monday, September 07, 2026

కాటేసిన పామునే కొరికేశాడు..!

calendar_today October 31, 2022
person dharshininews
కాటేసిన పామునే కొరికేశాడు..!
కాటేసిన పామునే కొరికేశాడు..! - బాలుడు క్షేమం.. పాము మృతి - ఛత్తీస్‌గడ్‌లో వింతకాని వింత ఘటన దర్శిని డెస్క్‌: ఎవరైనా పామును చూస్తే హడలెత్తి పోతారు. ఏమి చేయకుంటే ప్రాణాలతో వదిలేస్తారు. మీదకు వస్తే మాత్రం అంతం చూస్తారు. ఛత్తీస్‌గడ్‌లో 12 ఏండ్ల బాలుడు ఇదే పనిచేశాడు. తనను కాటేసిందని.. వెతికి మరీ కొరికేశాడు. ఆసుపత్రికి వెళ్లిన బాలుడు బ్రతికినా బాలుడు కొరికిన పాము మాత్రం మట్టికరిచింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్‌ జిల్లా పంద్రపుత్‌ గ్రామంలో పహాఢీ కోర్వా గిరిజన తెగకు చెందిన దీపక్‌ రామ్‌ (12) అనే బాలుడు తమ నివాసానికి సమీపంలో ఉన్న సోదరి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఓ పాము అతని చేతిపై కాటు వేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన దీపక్‌ పారిపోతున్న పామును వెంబడించి మరీ దొరకబుచ్చుకున్నాడు. వెంటనే గట్టిగా కొరికేశాడు. అనంతరం విషయం తెలియడంతో దీపక్‌ను అతని సోదరి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అతను కరిచిన పాము మాత్రం మరణించింది. తెలిసిన వారు.. చదివిన వారు ఇది వింత కాని వింత ఘటన అని చర్చించుకుంటున్నారు.