schedule Monday, September 07, 2026

చలితో జాగ్రత్త..!

calendar_today October 30, 2022
person dharshininews
చలితో జాగ్రత్త..!
చలితో జాగ్రత్త..! - పొంచిఉన్న వ్యాధులు - అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు దర్శిని డెస్క్‌: చలికాలం రావడంతోనే ఆందోళన కర పరిస్థితులను తీసుకవచ్చింది. మొన్నటి వరకు మండే ఎండలతో వేడెక్కాయి తెలుగు రాష్ట్రాలు, మరి నిన్నటి వరకు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. మరి ఇప్పుడు భరించలేని చలితో గజగజ వణుకుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టి చలి తీవ్రత బాగా పెరుగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ చలి గాలులు మరింత వేగం పుంజుకున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపద్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ, వైద్యులు సూచిస్తున్నారు. పొంచిఉన్న వ్యాధులు చలికాలం ప్రారంభం నుంచి చర్మసంబంధిత, ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం ఇంటి పట్టునే ఉండడమే మంచింది. రక్షణ చర్యలు రాత్రుళ్లు వాహనాల్లో ప్రయాణం చేసేవారు స్వెట్టరు, మంకీ క్యాప్, చేతులకు బ్లౌజులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. పేష్‌వాష్‌తో రోజూ ముఖం కడుక్కోవాలి. చిన్నారులు, వృద్ధులు చలికి తట్టుకోలేరు. వారి శరీరమంత కప్పేలా దుస్తులు వేయాలి. ఉదయం 8 గంటల వరకు, సాయత్రం 7 గంటల తరువాత బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఉప్పు, చక్కెర, కొవ్వు కలిగి ఉండే పానీయాలు, ఆహారం తక్కువగా తీసుకోవాలి.