schedule Tuesday, September 08, 2026

చెప్పుల‌తో బైక్ డ్రైవింగ్ చేస్తే ఫైన్ క‌ట్టాల్సిందే

calendar_today September 20, 2022
person dharshininews
చెప్పుల‌తో బైక్ డ్రైవింగ్ చేస్తే ఫైన్ క‌ట్టాల్సిందే
చెప్పుల‌తో బైక్ డ్రైవింగ్ చేస్తే ఫైన్ క‌ట్టాల్సిందే - చాలా మందికి తెలియ‌ని నిబంధ‌న‌ హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: వాహ‌నాల‌ను న‌డిపేవారు ట్రాఫిక్ రూల్స్ అన్ని తెలుసు అనుకుంటారు. పోలీసులు ప‌ట్టుకున్న‌ప్పుడో.. ఎవ‌రైనా అడ్డుకున్న‌ప్పుడో మాకు చాల తెలుసని అధికారుల‌తో వాధిస్తుంటారు. కాని చాలా నియ‌మాయాలు తెలియ‌ని అధికారులు చెప్పేదాక తెలుసుకోరు. సిగ్న‌ల్ జంపింగ్, హెల్మెట్ వాడ‌క పోవ‌డం, సీటు బెల్టు ధ‌రించ‌క‌పోవ‌డం వంటి కార‌ణాలతో జ‌రిమాన విధించిన‌ప్పుడు ఈ నియ‌మాల గురించి తెలుసుకున్నారు. ఇవి రహదారిపై ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన నియమాలు. మీరు తెలుసుకోవలసిన.. అంతగా తెలియని ట్రాఫిక్ నియమాలు చాలా ఉన్నాయి. కొన్ని మనకు తెలియని నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం. స్లీపర్లు లేదా ‘చెప్పులు’ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడపకూడదనేది కూడా ట్రాఫిక్ రూల్స్‌లో నియమం. దీని గురించి కొద్ది మందికి మాత్రమే బహుశా తెలుసి ఉంటుంది. వాస్తవానికి ప్రస్తుతమున్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం స్లీపర్లు లేదా ‘చెప్పులు’ ధరించి ద్విచక్ర వాహనాలను నడపకూడదు. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు పూర్తిగా మూసి ఉన్న బూట్లు ధరించడం అవసరం. అలా చేయని పక్షంలో రూ.1000 వరకు జరిమానా విధించవచ్చు. దీనితో పాటు, బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు ప్యాంటు, షర్ట్ లేదా టీ-షర్ట్ ధరించడం కూడా తప్పనిసరి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జరిమానా కూడా విధించవచ్చు. అయితే కొన్ని నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో మారుతుండవచ్చు.