schedule Sunday, July 05, 2026

ముంచెత్తిన వాన..!

calendar_today September 4, 2022
person dharshininews
ముంచెత్తిన వాన..!
ముంచెత్తిన వాన..! - నీట మునిగిన మిత్రానగర్ - ఆర్జీకే రోడ్డు జల దిగ్బందం - రాత్రంతా జనాల ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణాన్ని భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి కుండపోత వర్షం పడింది. గంటల కొద్ది కురిసిన వర్షంతో మున్సిపల్ పరిధిలోని మిత్రానగర్ పూర్తిగా నీటమునిగింది. రాత్రి నుంచి ఇండ్లలోకి వర్షపు నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. వర్షపునీరుతో ఇండ్లన్నీ స్విమ్మింగ్ పూల్ లను తలపించాయి. ఇళ్లంతా వర్షపు నీరు నిండుకోవడ వల్ల రాత్రంతా కాలనీ వాసులు అంతా జాగరణ చేశారు. ఎటు చూసినా నీరు నిండడం.. నీరు పారే దారి లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. ఆదివారం ఉదయం ఇండ్లలో నిండిన నీటిని ఎత్తిపోశారు. మరోవైపు శనివారం రాత్రి భారీ వర్షం పడడంతో తాండూరు - హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ కాలనీ రోడ్డు పూర్తిగా దిగ్బంధం అయ్యింది. ఈ రోడ్డు మార్గంలో ఉన్న చిలుక వాగు నాల నుంచి భారీగా వరదనీరు ప్రవహించింది. రోడ్డు మద్యన ఉన్న డివైడర్ పైనుంచి వర్షపు నీరు అలుగులా ప్రవహించింది. గంటల పాటు అటు ఇటూ రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కబ్జాల వల్లే కష్టాలు : మిత్రా నగర్ వాసులు ఆవేధన మరోవైపు మిత్రానగర్ కాలనీ వాసులు నేతలు, అధికారులపై మండిపడ్డారు. చిలుకవాగు కబ్జా కావడం వల్లే నీరు మళ్లే దారిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. అధికారులు, నేతలు సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో కూడ ఉంది చూడండి https://youtu.be/