schedule Monday, September 07, 2026

బంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్

calendar_today August 20, 2022
person dharshininews
బంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్
బంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్ - వ‌రుస‌గా ప‌డిపోతున్న ప‌సిడి ధ‌ర‌ - 22, 24 క్యారెట్ల ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే ద‌ర్శిని డెస్క్: బంగారం కొనుగోలు ప్రియుల‌కు ధ‌ర‌లు క‌లిసివ‌స్తున్నాయి. బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర రోజు ప‌డిపోతోంది. బుధ, గురువారాల్లో కలిపి 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 280లు త‌గ్గ‌గా తాజాగా శ‌నివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర మ‌రింత త‌గ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,800 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 తగ్గడంతో రూ.52,150 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ. 62,000 గా ఉంది. - హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,150 పలుకుతోంది - విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది. - విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..52,150 వద్ద ఉంది. - బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 పలుకుతోంది. - చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,220గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600 పలుకుతోంది. - ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది. - ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.52,310 పలుకుతోంది. - కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.52,150కు లభిస్తోంది. - కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది.