schedule Monday, September 07, 2026

మురిపించిన చిన్ని కృష్ణులు..!

calendar_today August 30, 2021
person dharshininews
మురిపించిన చిన్ని కృష్ణులు..!
మురిపించిన చిన్ని కృష్ణులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణంలోని ఇంటింటా చిన్నారులు చిన్ని కృష్ణుల వేషాధార‌ణ‌లో మురిపించారు. సోమ‌వారం శ్రీ‌కృష్ణాష్ట‌మి వేడుక‌ల‌ను ప్ర‌జ‌లు వైభ‌వంగా జ‌రుపుకున్నారు. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌లోని చిన్నారుల‌ను శ్రీ‌కృష్ణ‌, య‌శోధ‌, గోపిక‌లుగా వేషాధార‌ణ చేయించారు. ఇంట్లో చిన్నికృష్ణులు, గోపిక‌లు ఆట పాట‌ల‌తో సంద‌డి చేశారు. ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పాల్గొని చిన్నికృష్ణుని ఎత్తుకుని మురిసిపోయారు.