schedule Monday, September 07, 2026

ఆన్‌‌లై‌న్‌లో శ్రీవారి అంగ‌ప్రద‌క్షిణ టోకెన్లు

calendar_today June 14, 2022
person dharshininews
ఆన్‌‌లై‌న్‌లో శ్రీవారి అంగ‌ప్రద‌క్షిణ టోకెన్లు
ఆన్‌‌లై‌న్‌లో శ్రీవారి అంగ‌ప్రద‌క్షిణ టోకెన్లు - రేప‌టి నుంచి అందుబాటులోకి - ప్ర‌క‌టించిన టీటీడీ హైద‌రా‌బాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : తిరుమ‌ల తిరుప‌తి వెళ్లే శ్రీ‌వారి భక్తులకు దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. అంగ‌ప్రద‌క్షిణ టోకె‌న్లను రేపు బుధవారం (15వ తేదీ) నుంచి ఆన్‌‌లై‌న్‌లో భక్తు‌లకు అందు‌బా‌టులో ఉంచ‌ను‌న్నట్టు ప్రకటించింది. ఈనెల 15 నుంచి జూలై 31 వరకు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్‌‌లై‌న్‌లో జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ టోకె‌న్లు తీసుకోవాలనుకునేవారు https // tirupathibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసు‌కో‌వ‌చ్చని తెలిపారు. తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ రద్దు పౌర్ణమి సంద‌ర్భంగా నేడు శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తు‌న్నట్టు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ప్రస్తుతం స్వామివారి వార్షిక జ్యేష్ఠా‌భి‌షేకం ముగింపు వేడు‌కలు నిర్వహి‌స్తున్న నేప‌థ్యంలో గరుడ సేవను రద్దు చేస్తు‌న్నట్టు తెలి‌పింది.