schedule Sunday, July 05, 2026

ఎఫ్ఐఆర్ వివాదంపై ఎఫ్ఐఆర్

calendar_today February 11, 2022
person dharshininews
ఎఫ్ఐఆర్ వివాదంపై ఎఫ్ఐఆర్
ఎఫ్ఐఆర్ వివాదంపై ఎఫ్ఐఆర్ - థియేట‌ర్ య‌జ‌మాని, నిర్మాత‌, డైరెక్ట‌ర్ల‌పై కేసు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ఎఫ్ఐఆర్ సినిమా వివాదంపై తాండూరు పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. సినిమా పోస్ట‌ర్‌పై ఓ వ‌ర్గానికి సంబంధించిన వాక్యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ పోస్ట‌ర్ల‌ను అంటించ‌డంపై క‌ల్లోలం రేగిన విష‌యం తెలిసిందే. తాండూరు ప‌ట్ట‌ణంలోని శాంత్ మ‌హాల్ థియేట‌ర్‌లో ఎఫ్ఐఆర్ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. సినిమా ప్ర‌చారం కోసం థియేట‌ర్ యజ‌మాన్యం ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో పోస్ట‌ర్ల‌ను అంటించారు. ఈ పోస్ట‌ర్ల‌పై ఓ మ‌తానికి సంబంధించి వాక్యాల‌ను, వివాదాస్ప‌ద ప‌దాల‌ను ఉంచార‌ని వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. అదే స‌మ‌యంలో తాండూరుకు వ‌చ్చిన జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డిని క‌లిసి సినిమా వివాదంపై ఫిర్యాదు చేశారు. ముస్లిం వెల్పేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ ఫిర్యాదును అంద‌జేశారు. ఎస్పీ ఆదేశాల మేర‌కు తాండూరు పోలీసులు ముస్లిం వెల్పేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు బాబ‌ర్ ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్‌ను న‌మోదు చేశారు. వివాదానికి దారి తీసిన సినిమా పోస్ట‌ర్‌కు కార‌ణ‌మైన థియేట‌ర్ య‌జ‌మానితో పాటు సినిమా నిర్మాత‌, డైరెక్టర్‌పై ఐపీసీ సెక్ష‌న్ 295-A కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.