schedule Thursday, September 03, 2026

ఘ‌నంగా ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం

calendar_today August 19, 2021
person dharshininews
ఘ‌నంగా ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం
ఘ‌నంగా ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం - జిల్లా ఆసుప‌త్రిలో అల్పాహారం, పండ్ల పంపిణీ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో ప్రపంచ ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం ఘ‌నంగా జ‌రుపుకున్నారు. గురువారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తాండూరు నియోజకవర్గ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాండూరు జిల్లా ఆసుపత్రిలో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్ర పటానికి పుల మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, హిరాలాల్, వేమారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.