schedule Tuesday, November 03, 2026

ఓటరు నమోదులో దూకుడు పెంచండి!

calendar_today October 30, 2026
person dharshininews
ఓటరు నమోదులో దూకుడు పెంచండి!
ఓటరు నమోదులో దూకుడు పెంచండి..! - ప్రతి పట్టభద్రుడిని సంప్రదించండి - పార్టీ నేతలు చురుగ్గా పనిచేయాలి - పార్టీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్‌ నాయకులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పట్టభద్రుడికి ఫోన్‌ చేసి ఓటరుగా నమోదు చేసుకున్నారా లేదా తెలుసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి నమోదు ప్రక్రియలో సహకరించాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన నమోదులను సమీక్షించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శనివారం తాండూరుకు రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి విప్లవ్‌ కుమార్‌ పర్యటన నేపథ్యంలో నమోదు వివరాలు, సమస్యలపై పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని నాయకులకు సూచించారు. సమావేశంలో మండల, పట్టణ బీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, వీరేందర్ రెడ్డి, సిద్రాల శ్రీనివాస్, కోహిర్ శ్రీనివాస్, నర్సిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45237/