schedule Tuesday, November 03, 2026

ఘనంగా వాల్మీకీ మహర్షి జయంతి

calendar_today October 26, 2026
person dharshininews
ఘనంగా వాల్మీకీ మహర్షి జయంతి
ఘనంగా వాల్మీకీ మహర్షి జయంతి - వేడుకలో పాల్గొన్న చైర్ పర్సన్ నీరజా బాల్‌ రెడ్డి - దర్శించుకున్న నేతలు, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆదికవి మహర్షీ వాల్మీకీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం పట్టణంలోని వాల్మీకీనగర్‌లో వెలసిన వాల్మీకీ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాల్మీకీ మహార్షికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి హాజరై వాల్మీకీ మహర్షిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మహా ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామాయణ మహా కావ్యాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని పేర్కొన్నారు. ఆయన చూపిన సన్మార్గంలో అందరు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నేతలు తదితరులు ఉన్నారు. మరోవైపు తాండూరుకు చెందిన పలువురు ప్రముఖులు వాల్మీకీ మహర్షిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారాసింగ్, ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, పార్టీ నేతలు, కౌన్సిలర్లు తదితరులు జయంతి ఉత్సవాల్లో భాగంగా వాల్మీకీ మహర్షిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకీ సంఘం పెద్దలు, ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45195/