schedule Tuesday, November 03, 2026

పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం!

calendar_today October 22, 2026
person dharshininews
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం!
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం! - ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ప్రధాన అస్త్రం - పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి: రాబోయే రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని తాండూరు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాతుల నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పిలుపు మేరకు శంషాబాద్‌లో నిర్వహించనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిరుద్యోగులకు దాదాపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ అంశాలు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో ఓటు వేసిన వారు సైతం మళ్లీ ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా నమోదు చేసుకుని ఎన్నికల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. https://www.dharshininews.com/45170/