schedule Tuesday, November 03, 2026

దసరా ఉత్సవాలు దిగ్విజయం..!

calendar_today October 21, 2026
person dharshininews
దసరా ఉత్సవాలు దిగ్విజయం..!
దసరా ఉత్సవాలు దిగ్విజయం..! - సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు - హిందూ ఉత్సవ కేంద్ర సమితి - ఫ్లాట్ వివాదం త్వరలో పరిష్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో దసరా ఉత్సవాల విజయవంతంపై హిందూ ఉత్సవ సమితి హర్షం వ్యక్తం చేసింది. బుధవారం సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, పర్యాద రామకృష్ణ, వికాస్ జోషి తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన హిందూ బంధువులకు, అన్ని కుల సంఘాల ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, బోనమ్మ గుడి కమిటీ సభ్యులకు, యువతకు హిందూ ఉత్సవ కేంద్ర సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన పురపాలక శాఖ, పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ వర్గాల సమన్వయం, సహకారంతో దసరా ఉత్సవాలు విజయవంతమయ్యాయని సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణలో భాగస్వాములై సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఉత్సవాలలో జరిగిన వివాదం మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. వివాదానికి కారణమైన ఫ్లాట్ ను పెద్దలు చూపించడం జరిగిందని, దానిని త్వరలోనే పరిస్కరించుకుంటామని స్పష్టం చేశారు. https://www.dharshininews.com/45165/