schedule Tuesday, November 03, 2026

అట్టహాసంగా దసరా కప్‌–2026

calendar_today October 21, 2026
person dharshininews
అట్టహాసంగా దసరా కప్‌–2026
అట్టహాసంగా దసరా కప్‌–2026 - ఫుట్‌బాల్‌ టోర్నీ ప్రారంభించిన శంకర్ యాదవ్ - క్రీడలతోనే క్రమశిక్షణ, పట్టుదల లక్షణాలు అంటూ స్పూర్తి - తలపడనున్న పలు ప్రాంతాల జట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో దసరా కప్‌-2026 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్ సందడి మొదలైంది. యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ జూనియర్‌ కళాశాల మైదానంలో తాండూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ అండ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టోర్నమెంట్‌ ఏర్పాటు చేశారు. బుధవారం టోర్నమెంట్ స్పాన్సర్ శ్రీ సాయిపుత్ర హోమ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శంకర్‌ యాదవ్‌ టోర్నమెంట్ ప్రాంభించారు. క్రీడాకారులను ఉత్సాహపరిచి ఫుట్‌బాల్‌ ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే స్ఫూర్తి పెంపొందుతుందని అన్నారు. ఇలాంటి పోటీలకు తమవంతు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల జట్ల మధ్య పోటీ దసరా కప్‌–2026 టోర్నమెంట్‌లో జహీరాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, సదాశివపేట, తాండూరు, బొంరాస్‌పేట్‌తో పాటు మరో రెండు జట్లు పాల్గొంటున్నాయి. ఆయా జట్లు విజయం కోసం మైదానంలో తలపడనున్నాయి. ఈ పోటీలతో స్థానిక క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించనుంది. క్రీడల అభివృద్ధికి, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు శంకర్‌ యాదవ్‌ అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. తాండూరులో ఫుట్‌బాల్‌ క్రీడకు మరింత ఆదరణ పెరిగేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప, ఉపాధ్యాయ సంఘం నాయకులు జొన్నల వినోద్, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45163/