schedule Tuesday, November 03, 2026

కార్మికుల సేవకు జావీద్‌ గౌరవం..!

calendar_today October 20, 2026
person dharshininews
కార్మికుల సేవకు జావీద్‌ గౌరవం..!
కార్మికుల సేవకు జావీద్‌ గౌరవం..! - దసరాకు కొత్త దుస్తులు, నగదు కానుక - పండగ వేళ ఖుషీ చేసిన కౌన్సిలర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పండుగ వేళ తమ సేవలను గుర్తించి, తమలో ఆనందం నింపేలా తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్‌ జావీద్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. విజయదశమిని పురస్కరించుకుని వార్డులో నిరంతరం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, లేబర్లు, వార్డు జవాన్లకు తన సొంత ఖర్చులతో కొత్త దుస్తులు, నగదును పండుగ కానుకగా అందజేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న పారిశుధ్య సిబ్బంది సేవలను ఈ సందర్భంగా కౌన్సిలర్‌ జావీద్‌ కొనియాడారు. ప్రతిరోజూ విధుల్లో నిమగ్నమవుతూ ప్రజలకు సేవలందించే కార్మికుల ముఖాల్లో పండుగ వేళ ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈ కానుకలు అందించినట్లు తెలిపారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 8వ వార్డు ప్రజలతో పాటు తాండూరు పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్‌ జావీద్‌ తమ సేవలను గుర్తించి పండుగ కానుకలు అందజేయడంపై పారిశుధ్య కార్మికులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు జవాన్‌ అశోక్‌, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Pvr https://www.dharshininews.com/45157/