schedule Tuesday, November 03, 2026

బస్సులో బంగారం మాయం..!

calendar_today October 19, 2026
person dharshininews
బస్సులో బంగారం మాయం..!
బస్సులో బంగారం మాయం..! - పర్సు కత్తరించి చోరీ చేసిన దుండగులు - తల్లీ, కూతుళ్లకు ఎదురైన అనుభవం - తాండూరు పోలీసులకు బాధితురాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. ఓ ప్రయాణికురాలి పర్సును కత్తిరించి అందులో ఉన్న 2.5 తులాల బంగారు ఆభరణాన్ని అపహరించిన ఘటన తాండూరు పట్టణంలో వెలుగుచూసింది. పండుగ వేళ హైదరాబాద్‌కు బయలుదేరిన తల్లీకూతుళ్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పాత తాండూరుకు చెందిన ఆండాలమ్మ, కూతురు శీరిషలు సోమవారం హైదరాబాద్‌ వెళ్లేందుకు తాండూరు ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న శీరీష భర్త సతీష్‌ వద్దకు బయల్దేరారు. బస్సు ఎక్కిన కొద్ది సేపటికే టికెట్ తీసుకునేందుకని శీరీష ఆధార్‌ కార్డు కోసం వెంట తెచ్చుకున్న పర్సును తెరిచారు. అయితే పర్సుకు కత్తరించిన అనవాళ్లు కనిపించాయి. అనుమానం వచ్చి పరిశీలించగా అందులో ఉన్న 2.5తులాల బంగారు ఆభరణం కనిపించలేదు. అప్పటికే బస్సు డీపో నుంచి బయల్దేరింది. హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని రాజీవ్ కాలనీ వద్ద తల్లీ ఆండాలమ్మ, కూతురు శీరషలు దిగిపోయారు. వెంటనే ఇంటికి వెళ్లి ఇంట్లో మరిచారమో అని వెతికారు. కనిపించకపోవడంలో ఆర్టీసీ బస్టాండ్‌లో కూడా వెతికారు. ఎక్కడా లభించకపోవడంతో బస్సు ఎక్కే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కొట్టేసి ఉంటారని నిర్దారించుకున్నారు. వెంటనే తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. Pvr https://www.dharshininews.com/45149/