schedule Thursday, September 03, 2026

పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

calendar_today August 22, 2026
person dharshininews
పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్
పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్ - కేసు నమోదు చేసిన బషీరాబాద్‌ పోలీసులు - వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలలోని దామర్‌చేడ్ గ్రామంలో జరిగింది. ఎస్ఐ విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి దామర్‌చేడ్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో బషీరాబాద్‌ ఎస్‌ఐ విఠల్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, గోపాల్‌, లావా కుమార్‌, వెంకటేష్‌, జెమ్లా నాయక్‌ తండాకు చెందిన బాలకృష్ణ, రవి, సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి పేకాటకు ముక్కలు, నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. https://www.dharshininews.com/44326/