schedule Thursday, September 03, 2026

31 నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

calendar_today July 28, 2026
person dharshininews
31 నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
31 నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు - సబ్‌ జూనియర్స్‌, జూనియర్, సీనీయర్ విభాగాలలో నిర్వహణ - ఆహ్వానించిన జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈ నెల 31న జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాము, రాములు తెలిపారు. జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం పాత శాలివాహన కాలేజీ గ్రౌండ్‌లో జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయని చెప్పారు. సబ్ జూనియర్స్, జూనియర్, సీనీయర్‌(పురుషులు, మహిళలు) విభాగాలలో పోటీలు జరుగుతాయని తెలిపారు. 31వ తేదిన ఉదయం 8:30 గంటల నుంచి అండర్ 06, 08, 10, 12 విభాగలలో 60, 150, 200, 300, 400 మీటర్స్ బ్రాడ్ జంప్, లాంగ్‌జంప్, అండర్ -14,16, 20 మహిళలు, పురుషుల విభాగలలో జావెలిన్ త్రో పోటీలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపీయన్‌ షిఫ్‌ ద్వారా అండర్-18 విభాగంలో విభాగంలో రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్, పోటీలు కూడా ఉంటాయి తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే బాల బాలికలు తహసీల్దార్ జారీ చేసిన జననం ధ్రువీకరణ పత్రాలతో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సెల్‌: 99513 43432 ,6300075229లకు సంప్రదించాలని సూచించారు. https://www.dharshininews.com/43953/