schedule Thursday, September 03, 2026

ప్రతి యేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌

calendar_today July 28, 2026
person dharshininews
ప్రతి యేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌
ప్రతి యేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ - చెల్లింపులపై ప్రణాళిక రూపకల్పన - తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులను ఇకపై ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి ఏడాది చెల్లింపులు జరిగేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ హయాంలో బకాయిలు పెట్టిన రీయింబర్స్‌మెంట్‌ రూ.8వేల కోట్లు భారంగా మారింది. వాటిని మేం ఇవ్వట్లేదనే భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ ప్రతి యేడాది చెల్లించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. https://www.dharshininews.com/43948/