schedule Friday, September 04, 2026

బ్యాగులో ఎండు గంజాయి

calendar_today July 24, 2026
person dharshininews
బ్యాగులో ఎండు గంజాయి
బ్యాగులో ఎండు గంజాయి - గుట్టుగా రైల్లో రవాణా - పట్టుబడిన మైనర్ బాలుడు - 10 కిలోల ప్యాకెట్లు స్వాదీనం తాండూరు, దర్శిని ప్రతినిధి : బ్యాగులో ఎండు గంజాయిని తరలిస్తున్న ఓ మైనర్‌ బాలుడిని తాండూరు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. గుట్టుగా తరలిస్తున్న మైనర్ బాలుడిని పక్కా ప్లాన్‌తో అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓడిస్సా రాష్ట్రానికి చెందిన ఓ 17ఏళ్ల మైనర్ బాలుడు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా చేస్తూ తాండూరులో దిగాడు. విశ్వసనీయమైన సమాచారంతో రూరల్ సీఐ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో బాలుడు వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా ఎండు గంజాయి లభించింది. పంచనామ పూర్తి చేయగా సుమారు రూ. 2లక్షల విలువైన దాదాపు 10 కిలోల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించినట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. https://www.dharshininews.com/43894/