schedule Thursday, September 03, 2026

పోస్టల్ శాఖలో జాబ్స్..!

calendar_today July 21, 2026
person dharshininews
పోస్టల్ శాఖలో జాబ్స్..!
పోస్టల్ శాఖలో జాబ్స్..! - టెన్త్‌తోనే ఉద్యోగాల ఎంపిక - రాత పరీక్ష కూడా లేదు - వికారాబాద్‌ జిల్లా వాసులకు కూడా ఛాన్స్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : సికింద్రాబాద్‌ పోస్టల్ శాఖ పరిధిలో నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు సిద్దమైంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీల సేకరణ కోసం కమిషన్ ఆధారంగా ఏజెంట్లను నియమించేందుకు అవకాశాలను కల్పిస్తోంది. ఈ పోస్టులలో చేరేందుకు 18 ఏండ్లు నిండిన వారు, 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే అదే అర్హతగా ప్రకటించింది. హైదరాబాద్ నగరం, వికారాబాద్ ప్రాంతాల్లో నివసించే అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. తపాలా శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మాజీ జీవిత బీమా సలహాదారులు, వివిధ బీమా కంపెనీల మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్ – 500080 చిరునామాకు ఆగస్టు 7, 2026 లోపు సమర్పించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ ఎం. అన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం, ఎంపికైన ఏజెంట్లు రూ. 5,000 విలువైన NSC లేదా KVP రూపంలో డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియామకాలపై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సమీప తపాలా కార్యాలయం లేదా సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. https://www.dharshininews.com/43851/