schedule Thursday, September 03, 2026

రేపు తాండూరులో పవర్‌ కట్..!

calendar_today July 19, 2026
person dharshininews
రేపు తాండూరులో పవర్‌ కట్..!
రేపు తాండూరులో పవర్‌ కట్..! - గంటల పాటు విద్యుత్ అంతరాయం - ప్రకటించిన విద్యుత్ ఏడీఈ శంకర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు సోమవారం తాండూరులో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈడీ కె. శంకర్ తెలిపారు. 220/132 కేవీ తాండూరు సబ్‌స్టేషన్లో వార్షిక నిర్వహణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్ మరియు తాండూరు రూరల్ సెక్షన్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. కావున ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు ఈ తాత్కాలిక అసౌకర్యానికి సహకరింంచాలని కోరారు. https://www.dharshininews.com/43837/