schedule Thursday, September 03, 2026

సర్వే నెంబర్ 111, 112లో వివాదం..!

calendar_today July 17, 2026
person dharshininews
సర్వే నెంబర్ 111, 112లో వివాదం..!
సర్వే నెంబర్ 111, 112లో వివాదం..! - వెంచర్‌ రోడ్డులో భవన నిర్మాణం - ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు - గట్టిగా ఆరోపించిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సర్వే నెంబర్ 111, 112లో వివాదం తెరమీదకు వచ్చింది. ఆయా సర్వే నెంబర్లో ఉన్న వెంచర్‌లోని రోడ్డులో భవన నిర్మాణం చేపడుతున్నారని పక్క ప్లాట్‌ల యజమానులు ఆరోపించారు. ఈ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధి 111, 112లో చాలా ఏళ్ల క్రితం లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయించారు. ఈ వెంచర్‌లో ఫ్లాట్‌ నెంబర్ 29, 30, 55ల మద్యలో 30 ఫీట్ల రోడ్డు ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ రోడ్డు మార్గంలోని భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు గడ్డలి రవీందర్ కుమార్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డు మార్గంలో నిర్మాణ పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దీనిపై మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. లేఅవుట్‌లో రోడ్‌లో నిర్మాణ పనులు చేపట్టడంతో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని స్థానికులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇదే సంఘటనపై మున్సిపల్ టౌన్‌ ప్లానింగ్ అధికారులను వివరణ కోరగా ఎస్‌ఆర్‌ఓ నిబంధనలతో పాటు డాక్యుమెంట్ల ఆధారంగా నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగిందని దాటవేశారు. https://www.dharshininews.com/43799/