schedule Thursday, September 03, 2026

బీసీలపై విద్వేషం సహించం..! 

calendar_today July 15, 2026
person dharshininews
బీసీలపై విద్వేషం సహించం..! 
బీసీలపై విద్వేషం సహించం..!  - శివ చరణ్‌ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలపై, బీసీ కులాలపై విద్వేష పూరిత వాఖ్యలు చేస్తే సహించేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. యాదవ మహిళలను, గౌడ కులస్తులను అసభ్యంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివ చరణ్‌ రెడ్డి వైఖరిని ఖండించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్టీ ఈశ్వరమ్మ యాదవ్, గౌడ కులస్తులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన శివ చరణ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్ పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని అన్నారు. బీసీలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ రక్షణ చట్ట తీసుకురావాలని కోరారు. https://www.dharshininews.com/43782/