schedule Thursday, September 03, 2026

నీటి పొదుపు అందరి బాధ్యత

calendar_today July 14, 2026
person dharshininews
నీటి పొదుపు అందరి బాధ్యత
నీటి పొదుపు అందరి బాధ్యత - చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి - మున్సిపల్‌లో జల యజ్క్షంపై ప్రతిజ్ఞ తాండూరు, దర్శిని ప్రతినిధి : నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జల యజ్ఞంపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, కమీషనర్ రాకేష్‌ రెడ్డి తదితరులు కార్మికులతో కలిసి జల యజ్ఞంపై ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయని అన్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయన్నారు. నీటి కుళాయిల వద్ద, బోరు మోటార్ల వద్ద నీటిని వృథా చేయరాదని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43771/