schedule Thursday, September 03, 2026

సీఎం హోదా మరిచి విద్వేషాలా..?

calendar_today July 13, 2026
person dharshininews
సీఎం హోదా మరిచి విద్వేషాలా..?
సీఎం హోదా మరిచి విద్వేషాలా..? - కేసీఆర్‌ కుటుంబంపై వాఖ్యలు సహించం - బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి - రేవంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి స్థాయి మరిచి విద్వేషాలు రెచ్చగోట్టేలా వాఖ్యలు చేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై వాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సింరెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, కుటుంబంపై, బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం బాధ్యతారాహిత్యమని అన్నారు. చట్టం అందరికి సమానమే అని, ముఖ్యమంత్రి అయినా చట్టం ముందు విచారణను ఎదుర్కోవాల్సిందే అని అన్నారు. మరోసారి ఇలాంటి విద్వేషాలను రెచ్చగొడితే ఎంతటి పోరాటానికి అయినా బీఆర్ఎస్ సిద్దపడుతుందని హెచ్చరించారు. https://www.dharshininews.com/43762/