schedule Thursday, September 03, 2026

బీసీ సంఘం సామాజిక సృహ..!

calendar_today July 12, 2026
person dharshininews
బీసీ సంఘం సామాజిక సృహ..!
బీసీ సంఘం సామాజిక సృహ..! - బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిభిరం - ఇక ప్రతివారం శిబిరాలు నిర్వహిస్తాం - ప్రకటించిన బీసీ నేత కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటాలు చేసే బీసీ సంక్షేమ సంఘం సామాజిక సృహను చాటుకుంది. బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరంను నిర్వహించింది. ఆదివారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని లోటస్‌ ఆసుపత్రి సహాకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులకు జలుబు, దగ్గు, ఇతర ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా చదువుకుంటారని అన్నారు. దర్నాలు ర్యాలీలు మాత్రమే కాదు.. సమాజ సేవలో బీసీ సంఘం ముందు ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ లోటస్ హాస్పిటల్ ప్రతినిధి మాణిక్యం, ఆసుపత్రి వైద్యులు, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి సయ్యద్ షుకూర్, మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల, విజయలక్ష్మి, బీసీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బస్వరాజ్, బీసీ యువ నాయకులు పాండు గౌడ్, నరసింహ, రాము ముదిరాజ్, దుబాయ్ వెంకట్, పరమేష్, మంతటి రాజు, హరి ప్రసాద్, యాసర్, వివేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43745/